చికెన్ చట్ పట్ - Chicken Chatpat
కావలిసిన పదార్థాలు:
చికెన్ (బోన్ లెస్), ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కారం, పసుపు, దనియాలపొడి, గరం మసాలా, నిమ్మకాయ, టమాటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద,
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఉల్లిపాయలు , అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి, చికెన్ ముక్కలను వేసి తరువాత టమాటాలు, కారం , పసుపు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. ఉడికిన చికెన్ లో దనియాలపొడి, గరం మసాల పొడి వేసి నిమ్మకాయను పిండాలి. చివరాగ కొత్తిమీరను వేయాలి. అంతేనండీ... చికెన్ చట్ పట్ రెడీ..
Chicken Chatpat, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes