కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry
కావలిసిన పదార్ధాలు :
కొర్రమీను చేపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు
తయారుచేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి అది కాగాక గ్రైండ్ చేసిన ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి బాగా వేగనివ్వాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు , కొర్రమీను చేప ముక్కలను వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోయాలి. 15 నిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే రుచికరమైన కొర్రమీను చేపల ఇగురు రెడీ...
Korrameenu Chepa Iguru, Korrameenu Fish Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes