టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)
కావలిసిన పదార్ధాలు:
టమాటాలు, రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ములక్కాడలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు
తయారుచేసే విధానం :
ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచిమిర్చి, , కరివేపాకు వేసి వేగాక టమాటాలను ,అల్లంవెల్లుల్లిముద్ద, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి ఇప్పుడు ములక్కాడ ముక్కలను కూడా వేసి కొంతసేపు ఊడకనివ్వాలి. తరువాత టమాట ముక్కలు కొంత మాగ్గాక రొయ్యలను వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అసలు కొంచెం కూడా నీరు పోయనక్కరలేదు. ఆవిరికి ఉడికి కొంచెం గ్రేవీగా తయారవుతుంది. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే... వేడి వేడి అన్నంతో టొమాటో రొయ్యలు తింటే ఎంతో రుచిగా వుంటుంది.
Tomato Royyalu, Prawns Tomoto, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes