చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu
కావాల్సిన పదార్థాలు :
చిన్న చేపలు, చింతకాయ(ఉడకబెట్టినది), వెల్లుల్లిపాయ ముద్ద(పసుపు,పచ్చిమిర్చి,వెల్లుల్లి,ఉప్పు,జీలకర్ర), కారం
తయారు చేసే విధానం:
ముందుగా గిన్నెలో నూనె వేసి అది వేగాక, ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి ముద్దను వేసి కలపాలి. చేపలను వేయాలి. తరవాత ఉడకబెట్టిన చింతకాయ పులుసును పోయాలి. బాగా మరుగుతున్న పులుసులో సరిపడినంత కారం వేసి మంట చిన్నదిగా ఉంచి అయిదు నిముషాలు ఉడకనివ్వాలి. అంతే....వేడి వేడి చింతకాయ-చిన్నచేపల పులుసు రెడీ.
Chintakaya Chinna Chepalu, Chepala Pulusu, Small Fish Curry, Fish Recipes, Gotelugu Vantalu