మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry
కావలిసిన పదార్ధాలు:
బోన్ లెస్ చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కోడి గుడ్డు, మసాల పొడి ( లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క)
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగే లోపల చికెన్ ముక్కలకు పెరుగు నిమ్మకాయ రసం వేసి పట్టించాలి. తరువాత వేగిన ఉల్లిపాయల మిశ్రమం లో ఈ చికెన్ ముక్కలను వేసి కలిపి కారం, ఉప్పు వేసి 10 నిముషాలు మూత పెట్టాలి. తరువాత మసాలా పొడి వేయాలి. తరువాత కోడిగుడ్డు పగలకొట్టి అందులో వేయాలి. 5 నిముషాల తరువాత కొత్తిమీర వేయాలి. అంతే మహారాజ చికెన్ రెడీ!!!......
Maharaja Chicken, Chicken Curry, Maharaja Chicken Curry, Chciken Recipes, Gotelugu Vantalu