ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ - Prawns Fried Rice
కావలిసిన పదార్ధాలు:
ప్రాన్స్ ( ఉడకబెట్టినవి), ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికం, అజినమోటో, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, బియ్యం ( ఉడకబెట్టినవి),
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె పోసి తరిగిన కూరగాయముక్కలన్నీ వేయాలి. అవి బాగా వేగిన తరువాత ఉడకబెట్టిన ప్రాన్స్ ను వేసి కలపాలి. ముందుగానే రైస్ తయారుచేసుకోవాలి . తరువాత ఉప్పు , అజినమోటో వేసి కలపాలి. తరువాత వండిన రైస్ ని కూడా వేసి బాగా కలపాలి. చివరగా వెనిగర్, సోయాసాస్ వేసి కలపాలి. అంతే నండీ ఘుమఘుమలాడే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ..
Prawns Fried Rice, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes