పందెం కోడి కూర - Pandem Kodi Koora
కావలసిన పదార్థాలు:
పందెం కోడి మాంసం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం
తయారు చేయు విధానం:
పందెం కోడిని పసుపు పెట్టి కాల్చిన తర్వాత ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మసాలాకి కావలసిన పదార్ధాలను కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.(మసాలాకి కావలసిన పదార్ధాలు లవంగాలు, యాలిక్కాయలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు). ముందుగా బాణలిలో ఆయిల్ వేసుకుని వేడి చేసి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు మగ్గనివ్వాలి. దానిలో కొంచెం పసుపువేసి తరువాత పందెం కోడి మాంసం వేయాలి. వేసిన తరువాత మూత పెట్టి ఎక్కువసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత దానిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు తిప్పాలి. తిప్పిన తరువాత దానిలో సరిపడినంత కారం వేసుకోవాలి. కొంచెం సేపు తర్వాత దానిలో రాళ్ళ ఉప్పు వేయాలి, తరువాత గ్రైండ్ చేసిన మసాలా ముద్దని వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత మూత తీసి చూస్తే పందెం కోడి కూర రెడీ.
Pandem Kodi Koora, Pandem Kodi Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes