మటన్ ఛాప్స్ - Mutton Chops
కావలసిన పదార్థాలు:
మటన్ ఛాప్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం, నూనె, కారం, ఉప్పు, మసాలా పౌడర్
తయారుచేయు విధానం:
మటన్ ఛాప్స్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. ముందుగా బాణీలో నూనె వేసి బాగా వేడి చేసుకుని ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత మటన్ ఛాప్స్ ని అందులో వేసి మూత పెట్టాలి. దీనిలో అటోమేటిక్ గా నీరు వస్తుంది. మటన్ ఛాప్స్ సగం ఉడికిన తరువాత కారం, ఉప్పు వేసి దీన్ని కలిపి మూత పెట్టాలి. బాగా ఉడికిన తరువాత కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కలిపి 10 నిమిషాల తర్వాత ఆపేస్తే ఘుమఘుమలాడే మటన్ ఛాప్స్ రెడీ.
Mutton Chops, Mutton Recipe, Mutton Curry, Gotelugu Vantalu