ములక్కాడ మాంసం - Mulakkada Mamsam
కావలిసిన పదార్ధాలు:
మటన్, ములక్కాడలు, ఉల్లిపాయలు , పచ్చిమిర్చి, గరం మసాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద
తయారుచేసే విధానం:
ముందుగా గిన్నె లో నూనె వేసి అది కాగాక ఉల్లిపాయలను, పచ్చిమిర్చి వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. తరువాత మటన్ ను వేసి తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత ములక్కాడలు, కారం, ఉప్పు వేసి చివరగా గరం మసాలా పొడిని వేసి కలిపి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతే పల్లె పద్ధతిలో చేసిన ములక్కాడ మాంసం రెడీ.
Mulakkada Mamsam, Mulakkada Mutton Curry, Gotelugu Non Veg Recipes, Gotelugu Vantalu