మసాలా ఆమ్లేట్ - Masala Omlet
కావలిసిన పదార్ధాలు:
కోడి గుడ్లు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, క్యారెట్లు, అల్లం, వెల్లుల్లి ముద్ద
తయారుచేయు విధానం :
ముందుగా ఒక గిన్నెలో క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ముక్కలను వేసుకోవాలి. అందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని ఆ తరువాత కోడి గుడ్లు పగలగొట్టి అందులో బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే ఆమ్లేట్ అంత పొంగుతుంది. తరువాత పొయ్యి పై పెనం వేడి చేసుకుని కొద్దిగా నూనె వేసి ఈ కలిపిన మిశ్రమాన్ని గుండ్రం గా పోయాలి. 2 నిమిషాల తరువాత మెల్లగా తిరిగేయాలి. కొంచెం బంగారు రంగు వచ్చేవరకు చిన్న మంటపై వుంచాలి. అంతే వేడి వేడి మసాలా ఆమ్లేట్ రెడీ...!!
Masala Omlet, Omlet, Masala Omlet Recipe, Gotelugu Vantalu