కోడి గుడ్డు బూరి కూర - Kodi Guddu Buri Kura
కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర
తయారు చేయు విధానం:
ముందుగా బాణీలో నూనె వేడిచేసుకుని ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగగానే టమాటా ముక్కలు వేయాలి. తరువాత దానిలో పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత కోడిగుడ్లు పగల కొట్టి దానిపైన వేయాలి. వేసిన తరువాత కలపకూడదు. కలపకుండా మూతపెట్టి సన్నమంట మీద 10 నిముషాలు మగ్గనివ్వాలి. తరువాత దానిని నాలుగు ముక్కలుగా కోసి వెనక్కి తిప్పుకోవాలి. తిప్పిన తరువాత దానిపై కొత్తిమీర చల్లుకోవాలి. చల్లిన తరువాత సన్న మంట మీద దింపితే కోడిగుడ్డు బూరి కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తినవచ్చు.
Kodi Guddu Buri Kura, Egg Curry, Egg Recipe, Kodi Guddu Koora, Gotelugu Vantalu