దాబా చికెన్ - Dhaba Chicken
కావలిసిన పదార్ధాలు:
చికెన్, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, దాల్చిన చెక్క, గరం మసాలా పొడి, యాలకులు, లవంగాలు, కారం, పసుపు, ఉప్పు, నిమ్మకాయ, టమాటాలు, కొత్తిమీర, పెరుగు
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి వేగాక టమాటాలను వేసి కలపి కొద్దిగా పెరుగును వేసి కలపాలి. చికెన్ కు ముందుగానే అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మకాయ రసాన్ని పట్టించి రెండుగంటలు ఫ్రిజ్ లో వుంచాలి. ఇలా తయారుచేసి వుంచిన చికెన్ మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయ, టమాటాలలో వేసి తగినంత కారం, ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోసి 10 నిముషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడిని, కొత్తిమీరను వేసి కలపాలి.
Dhaba Chicken, Dhaba Chicken Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes