అరటికాయ చికెన్ - Aratikaya Chicken
కావలిసిన పదార్ధాలు:
చికెన్ ముక్కలు (బోన్ లెస్), అరటికాయ ముక్కలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, కారం, పసుపు, చింతపండు
తయారుచేసే విధానం:
ముందుగా బాణలీలో నూనె వేసి అది కాగాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత చికెన్ ముక్కలు, అరటికాయముక్కలు వేసి కలిపి తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి 15 నిముషాలు మూతపెట్టి ఉంచాలి. అది ఆవిరికి ఉడుకుతుంది. తరువాత నానబెట్టిన చింతపండు పులుసును ఈ మిశ్రమంలో పోసి బాగా కలపాలి. 10 నిముషాలవరకూ మూతపెట్టి వుంచితే అరటికాయముక్కలు, చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. అంతే వేడి వేడి అరటికాయ చికెన్ రెడీ...!
Aratikaya Chicken, Raw Banana Chicken, Chicken Curry, Gotelugu Vantalu