ఆంధ్రా చికెన్ ఫ్రై - Andhra Chicken Fry
కావలసిన పదార్థాలు:
చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, అజీనా మోటో, నిమ్మకాయ రసం
తయారు చేయు విధానం:
ముందుగా చికెన్ తీసుకుని దానిని శుభ్రంగా కడిగి దానిలో పసుపు, సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అజీనా మోటో, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టి ఉంచాలి. తరువాత దానిని తీసి మరిగించిన నూనె లో ముందుగా లవంగాలు వేసి అవి కొంచెం వేగిన తరువాత పెద్దగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత నానబెట్టిన చికెన్ ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత దానిని మీడియం మంట మీద ఉంచి మూతపెట్టి 15 నిమిషాల వరకు ఉడికించాలి. 15 నిమిషాల తరువాత దానిని తీసి కొంచెం పెద్ద మంట మీద పెట్టి, ఆయిల్ చికెన్ కి పట్టేటట్టు అటు ఇటు తిప్పాలి. చివరి 5 నిమిషాలలో చికెన్ ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ గా ఉంటుంది. (మసాలా ఇంకా కావాలనుకునేవారు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కొట్టుకుని వేసుకోవచ్చు). కొంచెం వేగిన తరువాత కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు దీనిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇది అన్నం, చపాతీ, బిర్యానీ లోకి బాగుంటుంది. మామూలు చికిన్ ఫ్రై గట్టిగా ఉంటుంది. ఇది అలా కాకుండా మెత్తగా, మృదువుగా ఉంటుంది.
Andhra Chicken Fry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes