'గో తెలుగు' పాట - Gotelugu Promo Song

పల్లవి:
తెలుగు అక్షరం, తెలుగు లక్షణం - తెలుగు సంస్కృతి చూడాలంటే
గో తెలుగు ఇది గోతెలుగు
తనివి తీరని, తరగి పోవని - తెలుగు కడలిలో ఈదాలంటే
గో తెలుగు ఇది గో తెలుగు
బాపు గీతతో ముఖచిత్రం ముస్తాబైనది మీ కోసం
గో తెలుగు ఇది గోతెలుగు

చరణం 1:
కథలు నవలలు కొలువైన - పాటల, గజళ్ళ నెలవైన
గో తెలుగు ఇది గో తెలుగు
చిట్టి కవితలు, హైకూలు - నవ్యమైన పలు నానీలు
గో తెలుగు ఇది గో తెలుగు
భాషకు, యాసకు బంగరు సింహాసనమే గో తెలుగు ఇది గోతెలుగు
తెలుగు జాతికి, తెలుగు కీర్తికి కట్టిన కోటే గో తెలుగు ఇది గోతెలుగు

చరణం 2:
నవ్వుల బొమ్మల అచ్చట్లు - సరదా సినిమా ముచ్చట్లు
గో తెలుగు ఇది గోతెలుగు
పద్యాల్లోని రసపట్లు - అవధానంలో కనికట్లు
గో తెలుగు ఇది గోతెలుగు
నవతరానికి యువకలానికి వేదిక పరిచే గో తెలుగు ఇది గోతెలుగు
మహిళల, బాలల రచనలతో కళకళ లాడే గోతెలుగు ఇది గోతెలుగు


Gotelugu, Gotelugu Promo Song, Telugu Music, Telugu Song, Gazhal Srinivas, Sirasri, Lyrics

More Videos


భాస్కరభట్ల (కాజలు చెల్లివా)

భాస్కరభట్ల (టాప్ లేసిపోద్ది)

భాస్కరభట్ల (ఒక చూపుకే పడిపోయా)

భాస్కరభట్ల (నువ్వు వుంటే చాలు)

భాస్కరభట్ల (ఓ మగువ నీతో స్నేహం)

భాస్కరభట్ల (ఏమి సేతురా సామీ)

భాస్కరభట్ల (నువ్వేలే నువ్వేలే)

భాస్కరభట్ల (ఎందుకే రమణమ్మ)

భాస్కరభట్ల (గుండెజారి గల్లంతు అయ్యిందే)