వెజ్ ఫ్రైడ్ రైస్ - Veg Fried Rice
కావలసిన పదార్థాలు:
క్యారట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలపొడి, అజీనా మోటో, సాల్ట్, వండిన అన్నం.
తయారుచేయు విధానం:
ముందుగా బాణీ పెట్టి నూనె వేసి వేడి చేసి అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చి మిర్చి, క్యాప్సికమ్, క్యారట్, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసుకుని దోరగా వేపుకోవాలి. తరువాత సరిపడినంత సాల్ట్ వేసుకుని కొంచెం తిప్పి రెండు నిమిషాలు మూత పెట్టాలి. ఫ్రైడ్ రైస్ ముక్కలు బాగా మగ్గిన తరువాత దానిలో కొంచెం కొత్తిమీర, మిరియాలపొడి వేసి అంతా కలిసేటట్టు తిప్పుకుని దానిలో రైస్ వేసుకోవాలి. రైస్ వేసి మొత్తం తిప్పాలి. వెజిటబుల్స్ ముక్కలతో అన్నం మొత్తం కలిసిన తరువాత దానిలో కొంచెం అజీనా మోటో వేసుకోవాలి. ఇప్పుడు ఘుమఘుమలాడే వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీనిని సలాడ్ తో కలిపి తీసుకోవచ్చు.
Veg Fried Rice, Vegitable Fried Rice, Fried Rice, Fried Rice Recipe, Gotelugu Vantalu