వంగి బాత్ (వంకాయ రైస్) - Vankaya Rice
కావలసిన పదార్థాలు:
వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి, కొత్తిమీర, రైస్
తయారు చేయు విధానం:
ముందుగా బాణీలో నూనె వేడి చేసుకొని పోపు దినుసులు(ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు ) వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక అందులో నిలువుగా కోసిన వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియాలపొడి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు బాగా వేగాక కొద్దిగా నిమ్మరసం వేసుకొని ముందుగా వండిన రైస్ ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రుచికరమైన వంకాయ రైస్ రెడీ.
Vankaya Rice, Vangi Bath, Brinjal Rice, Brinjal Biryani, Gotelugu Vantalu