ఉప్పుడు పిండి - Uppudu Pindi
కావలసిన పదార్థాలు:
బియ్యపురవ్వ, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు
తయారుచేయు విధానం:
ముందుగా కొంచెం దళసరిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. నూనె వేడిచేసుకుని ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. తరువాత దానిలో కరివేపాకు, ఎండుమిర్చి వేసి, ఒక గ్లాసు బియ్యపు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు వేయాలి. నీళ్ళు పోసి ఒకసారి కలుపుకుని మూతపెట్టాలి. ఉప్పు, బియ్యపురవ్వు ఒకేసారి వెయ్యాలి. నీళ్ళు బాగా మరిగిన తరువాత మంట చిన్నది చేసుకుని సరిపడినంత ఉప్పు, వరినూక వేసి ఒకసారి బాగా కలుపుకుని బాగా చిన్నమంట మీద పెట్టుకోవాలి. కొంచెం సేపు తర్వాత దించితే ఉప్పుడు పిండి రెడీ. (ఎంత ఎక్కువ సేపు స్టౌవ్ మీద పెట్టి మగ్గనిస్తే అంత రుచిగా ఉంటుంది). దీనిని ప్లేట్ లోకి తీసుకుని ఆవకాయతో గాని, టమాటా చెట్నీతో గాని కలుపుకుని తింటే బాగుంటుంది.
Uppudu Pindi, Uppudu Upma, Uppidipindi, Gotelugu Vantalu