తోటకూర పులుసు - Thotakura Pulusu
కావాలసిన పదార్థాలు: తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, సరిపడినంత బెల్లం, వెల్లుల్లి, పచ్చి మిరప కాయలు, ఆవాలు, జీలకర్ర.
తయారు చేయు విధానం: ముందుగా తోటకూరని ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసుకొని దోరగా వేపుకోవాలి.
కొద్దిగా వేగిన తరువాత రెండు ఎండు మిరపకాయలు, తగినంత పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మంట చిన్నగా చేసుకొని అందులో తోటకూర వేసుకొని మూత పెట్టుకోవాలి. తోటకూర మగ్గి నీళ్ళు వస్తునప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. చింతపండు రసం చిక్కగా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకొని చిన్న మంటపై ఒక ఐదు నిమిషాలు వుంచుకుంటే చక్కటి తోటకూర పులుసు రెడీ.
ఈ కూరలో బెల్లం కి బదులు నువ్వులపొడి కూడా వాడవచ్చు.
Thotakura Pulusu, Garden Leaves Curry, Thotakura Curry, Gotelugu Vantalu