పొట్ల కాయ పొడి కూర - Potlakaya Podi Kura
కావలిసిన పదార్ధాలు:
పొట్లకాయలు
శనగపిండి
కారం
ఉప్పు
నూనె
పోపు దినుసులు
కరివేపాకు
పసుపు
ఎండుమిర్చి
తయారుచేసే విధానం:
ముందుగా పొట్లకాయలను పొట్టు తీసి సగానికి కోసి అందులో వున్న గింజలను తీసివేసి చిన్నగా తరిగి వుంచాలి. తరువాత బాణలిలో నూనె పోసి అది కాగాక పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి వేగిన తరువాత పొట్లకాయ ముక్కలను వేసి తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి కొంత సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిముషాల తరువాత మూత తీసి పొట్లకాయ ముక్కలు ఉడికిన తరువాత కొంచెం శనగపిండి వేసి బాగా కలపాలి. శనగ పిండి కమ్మటి వాసన వచ్చే వరకూ బాగా వేగనివ్వాలి. అంతే వేడి వేడి పొట్లకాయ పొడి కూర రెడీ!
Potlakaya Podi Kura, Potlakaya Nuvvula Podi Kura, Potlakaya Fry, Gotelugu Vantalu