పొట్లకాయ పెరుగు పచ్చడి - Potlakaya Perugu Pacchadi
కావలిసిన పదార్ధాలు :
పొట్లకాయ ముక్కలు (ఉడికినవి), పెరుగు, ఎండుమిర్చి, వెల్లుల్లి పాయలు, కరివెపాకు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి (చిన్నగా తరిగినవి), పసుపు, జీలకర్ర
తయారుచేసే విధానం :
బాణలిలో నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పాయలు, కరివెపాకు, పసుపు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తరువాత ఈ పోపు మిశ్రమంలో ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలను వేసి 2 నిముషాల తరువాత స్టవ్ ఆర్పేయాలి. వెంటనే పెరుగు, ఉప్పు వేసి కలపాలి. తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ!
Potlakaya Perugu Pacchadi, Potlakaya Perugu Chutney, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes