పల్లీల చట్నీ - Pallee Chutney
కావలసిన పదార్థాలు:
పల్లీలు, పచ్చిమిర్చి, నూనె, ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి
తయారుచేయు విధానం:
ముందుగా బాణీ పెట్టి నూనె వేయకుండా పల్లీలు వేసి 5 నుంచి 10 నిమిషాలు వేగనివ్వాలి. వేగగానే స్టౌవ్ ఆపేసి చల్లారనిచ్చి పచ్చిమిర్చి, పల్లీలు వేసి గ్రైండ్ చేసుకుని, తరువాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత దానికి మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం ముందుగా బాణీ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పప్పుదినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కలిపి పోపు చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే, ఇడ్లీ మరియు దోశ లోకి చాలా బాగుంటుంది
Pallee Chutney, Groundnut chutney, verusanaga chutney, Pallee Pickle, Gotelugu Vantalu