పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora
కావలసిన పదార్థాలు:
పచ్చి సెనగలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం
తయారు చేయు విధానం:
ముందుగా బాణీలో నూనె పోసి వేడి చేయాలి. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు దానిలో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పాలి. తరువాత దానిలో పచ్చి సెనగలు వేసి కొంచెం సేపు మూతపెట్టాలి. తరువాత దానిలో పసుపు, ఉప్పు, కారం వేసి తరువాత దానిలో కొన్ని టమాటా ముక్కలు వేసి అటు, ఇటు తిప్పి మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనిస్తే పచ్చి సెనగల కూర రెడీ. ఇది చపాతీలోకి గాని లేదా రైస్ లోకి గాని బాగుంటుంది.
Pacchi Senagala Koora, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes