ఉల్లిపాయ పకోడీ - Onion Pakodi
కావలిసిన పదార్ధాలు
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బియ్యప్పిండి, అల్లం, కరివేపాకు, జీలకర్ర, వెన్న, శనగపిండి, నూనె, ఉప్పు
తయారుచేసే విధానం
ఉల్లిపాయలు తరిగి వాటికి వెన్న, ఉప్పు కలిపి పట్టించాలి. ఇలా ఉప్పు పట్టించడం వల్ల కొంత నీరు చేరుతుంది. తరువాత అల్లం, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంత బియ్యప్పిండి వేసి కలపాలి. ఇలా బియ్యప్పిండి వేయడం వలన పకోడీలు కరకరలాడుతాయి కావలిసినంత శనగపిండి వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలపాలి. తరువాత బాణాలిలో నూనె వేసి కాగాకా ఈ శనగపిండి మిశ్రమాన్ని కాగిన నూనెలో అక్కడక్కడా వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు గోలించి తీసివేయాలి. అంతే వేడి వేడి పకోడీ రెడీ...!
Onion Pakodi, Onion Pakoda, Pakodi, Pyas Pakoda, Gotelugu Vantalu