ములక్కాయ మసాలా కూర - Mulakkaya Masala Kura
కావలిసిన పదార్ధాలు:
ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నూనె, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, మసాలా పొడి, కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అది కాగాకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఇవన్నీ వేగాకా అల్లంవెల్లుల్లి పేస్ట్ కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ములక్కాయలు వేసి కొంత నీరు పోసి 15 నిముషాలు నీరంతా మగ్గేవరకూ వుంచాలి. చివరగా కొత్తిమీర, మసాల పొడి వేసి కలపాలి. అంతే వేడి వేడి ములక్కాయ మసాలా కూర రెడీ...!
Mulakkada Masala Curry, Drumsticks Masala Curry, Drumsticks Masala Recipe, Gotelugu Vantalu