కరివేపాకు పచ్చడి - Karivepaku Pachhadi
కావలసిన పదార్థాలు
కరివేపాకు, ఎండు మిరప కాయలు, వెల్లుల్లిపాయలు, నూనె, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, బెల్లం
తయారు చేయు విధానం
ముందుగా బాణాలిని పొయ్యి మీద పెట్టి మంట చిన్నదిగా చేసి వేడెక్కనివ్వాలి. తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ధనియాలు (కొన్ని) వేసి బాగా దోరగా వేయించాలి. వేయించిన ఈ మిశ్రమము చల్లారాక, గరిండ్ చేయాలి. గ్రైండ్ చేసేముందు ఈ కరివేపాకు మిశ్రమం లో బెల్లం, ఉప్పూ కొన్ని నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.తర్వాత బాణలిలో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి, ఈ వేగిన పోపును కరివేపాకు ముద్దలో కలపాలి. అంతే...వేడి వేడి కరివేపాకు పచ్చడి రెడీ......
Karivepaku Pachadi, karivepaku Pickle, Curry Leaves Recipe, Gotelugu Vantalu