కొబ్బరి పచ్చడి (అన్నం లోకి) - Coconut Chutney
కావలిసిన పదార్ధాలు:
తురిమిన కొబ్బరి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, మినపప్పు, వెల్లుల్లిరేకలు, జీలకర్ర
తయారుచేసేవిధానం:
ముందుగా బాణలిలో నూనె వేడి చేసుకుని శనగపప్పు, మినప్పప్పు ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిరేకలు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత చింతపండు, కొబ్బరితురుము వేసి స్టవ్ కట్టేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి. వేడి వేడి అన్నం లోకి ఈ కొబ్బరిపచ్చడి చాలా రుచిగా వుంటుంది.
Coconut Chutney, Kobbari Pachadi, Coconut Recipes, Coconut Pachhadi, Gotelugu Vantalu