క్యారట్ కోరు కూర - Carrot Curry
కావలసిన పదార్థాలు :
క్యారట్, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చి మిర్చి, నూనె, ఉప్పు, కారం
తయారు చేయు విధానం :
ముందుగా క్యారట్ ని చెక్కుకుని కడిగి అవి కోరు తీయాలి. బాణీలో నూనె వేసి వేడి అయిన తరువాత పోపు దినెసలు వేయాలి. అందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి వేగుతున్నప్పుడే మనం కోరి పెట్టిన క్యారట్ ని దానిలో వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి. క్యారట్ బాగా మగ్గిన తరువాత దానిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కలిపి సన్న మంట మీద మూత పెట్టి అయిదు నిమిషాలు మగ్గనిస్తే క్యారట్ కోరు కూర రెడీ.
Carrot Curry, Carrot Koru Koora, Carrot Recipe, Gotelugu Vantalu