క్యాప్సికం మసాల - Capsicum Masala
కావలసిన పదార్థాలు:
క్యాప్సికం, టమాట , ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు , పసుపు, కారం
తయారుచేయు విధానం:
ముందుగా క్యాప్సికం, టమాట , ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ పై బాణలి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగగానే అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగగానే అందులో క్యాప్సికం ముక్కలు మరియు టమాట ముక్కలు, తగినంత పసుపు, ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత అందులో కొత్తిమీర వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని, స్టవ్ ఆపేసి, ఒక అయిదు నిమిషాల తరువాత వడ్డించుకుంటే బాగుంటుంది
Capsicum Masala, Capsicum Masala Curry, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu