బీరకాయ పచ్చడి - Berakaya Pachadi
కావలసిన పదార్థాలు:
బీరకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, పసుపు, ఉప్పు
తయారు చేయు విధానం:
ముందుగా బీరకాయల్ని పొట్టుతీయకుండా, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ పైన మూకుడు పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక బీరకాయ ముక్కలు అందులో వేసుకొని, ఒకసారి కలుపుకొని, కొద్దిగా పసుపు మరియు తగినంత ఉప్పు, చింతపండు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని, మూత పెట్టి సన్ని మంటపై కొద్ది సేపు ఉడకనివ్వాలి. బీరకాయలో నీరు అంతా ఇంకి పోయాక, స్టవ్ ఆపేసి కూరని చల్లారనివ్వాలి.
మిక్సీలో కొన్ని వెల్లుల్లి పాయలు, కొత్తిమీర, బీరకాయ కూర ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ పోపు ను బీరకాయ పచ్చడిలో కలుకొని, పైన కొత్తిమీర చల్లుకుంటే నోరూరించే బీరకాయ పచ్చడి రెడీ.
Berakaya Pachadi, Ridge Gourd Pickle, Berakaya Pickle, Gotelugu Vantalu