బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry
కావలసిన పదార్థాలు:
బంగాళా దుంపలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, పెరుగు
తయారు చేయు విధానం:
ముందుగా నూనె వేడిచేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్న సమయంలోనే బంగాళాదుంప ముక్కలకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. వీటన్నిటినీ కలపాలి. మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లో, కలిపిన బంగాళాదుంప ముక్కలు వేసి అటు, ఇటు తిప్పి దానిలో కొంచెం నీళ్ళు వేసి మూత పెట్టాలి. కొంచెం సేపు తర్వాత తీసి చూస్తే గుమగుమ లాడే బంగాళా దుంప మసాల కూర రెడీ. దీనిని ఒక బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
Bangala Dumpa Masala Curry, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes