అమ్మమ్మ పప్పు చారు - Ammamma Pappu Charu
'అమ్మమ్మ పప్పు చారు' తయారుచేయు విధానం!
ముందుగా కందిపప్పును ఉడికించి వుంచుకోవాలి. ఉడికించిన కందిపప్పును గరిటతో మెత్తగా మెదుపుకొని, ఉల్లిపాయలు పెద్దముక్కలు (ఒక ఉల్లిపాయ), టమాట ముక్కలు (ఒక టమాట), నిలువుగా చీరిన 6 పచ్చిమిర్చిలు, కరివేపాకు (2రెబ్బలు), కొద్దిగా కొత్తిమీర, చింతపండు పులుసు (తగినంత), ఉప్పు (రుచికి తగినంత), పసుపు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.
చక్కగా మరిగిన ' పప్పు చారు' కు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 2 వెల్లుల్లి రేకులుతో నేతి తాలింపు పెట్టుకోవాలి. కొత్తిమీర చల్లి ఘుమఘుమ లాడే పొగల కక్కే 'పప్పు చారు' ఆరగించడానికి రెడీ!
అప్పడాలు / వడియాలు నంజుకుంటే 'ఆహా...' అంటారు!!
Pappu Charu, Ammamma Pappu Charu, Sambar, Dal Rasam, Simple Sambar