వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu
కావలిసిన పదార్ధాలు:
చిక్కుడు కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు
తయారుచేసే విధానం:
ముందుగా కుక్కర్లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక చిక్కుడుకాయను వేసి పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఈలోగా జీలకర్రను, వెల్లుల్లిపాయలను కలిపి ముద్దగా చేసి వుంచాలి. 2 విజిల్స్ వచ్చాక ఉడికిన చిక్కుడుకాయలో ఈ వెల్లుల్లి ముద్దని వేసి కలిపాలి. అంతే రుచికరమైన వెల్లుల్లి చిక్కుడు రెడీ..
Vellulli Chikkudu, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes